రైతుల ఉద్యమాన్ని సీరియస్‌గా తీసుకోండి: శరద్ పవార్
ABN, First Publish Date - 2020-12-29T05:08:16+05:30
రైతుల ఉద్యమాన్ని సీరియస్‌గా తీసుకోండి: శరద్ పవార్
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతులు చేపట్టిన ఆందోళనను కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కోరారు. చర్చల ద్వారా సత్వరం ఓ పరిష్కార మార్గాన్ని కనిపెట్టాలని ఆయన సూచించారు. ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘‘మొత్తం వ్యవహారాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని నేను కోరుతున్నాను. చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా దీనికి పరిష్కారం కనిపెట్టాలి..’’ అని ఆయన పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న చోటే కొందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అలాంటి నాలుగైదు ఘటనలు చోటుచేసుకున్నట్టు నేను విన్నాను. అలాంటి పరిస్థితి మరింత పెరిగితే.. అది దేశానికి మంచిది కాదు...’’ అని పవార్ పేర్కొన్నారు.
Updated Date - 2020-12-29T05:08:16+05:30 IST