ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షహీన్‌బాగ్ శిబిరాన్ని ఖాళీ చేయించిన పోలీసులు

ABN, First Publish Date - 2020-03-24T14:30:35+05:30

దేశంలో ప్రబలుతున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు గాను ఢిల్లీ లాక్‌డౌన్‌ ప్రకటించిన పోలీసులు మంగళవారం ఉదయం షహీన్‌బాగ్ నిరసన శిబిరాన్ని బలవంతంగా ఖాళీ చేయించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 9 మంది నిరసనకారుల అరెస్ట్

న్యూఢిల్లీ : దేశంలో ప్రబలుతున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు గాను ఢిల్లీ లాక్‌డౌన్‌ ప్రకటించిన పోలీసులు మంగళవారం ఉదయం షహీన్‌బాగ్ నిరసన శిబిరాన్ని బలవంతంగా ఖాళీ చేయించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని నెలలుగా వందలాది మంది మహిళలు షహీన్‌బాగ్ శిబిరంలో నిరసన తెలుపుతున్నారు. ఈ శిబిరంలో ఉన్న కొందరు మహిళలు ప్రతిఘటించినా పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకొని షహీన్‌బాగ్ నిరసన శిబిరాన్ని ఖాళీ చేయించారు. 144 సెక్షన్ ను ఉల్లంఘించారని ఆరుగురు 9మంది నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు.


మంగళవారం కొందరు మహిళలు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావంగా తమ చెప్పులను నిరసన శిబిరంలో పెట్టారు. పెద్ద సంఖ్యలో వచ్చిన సాయుధ పోలీసులు పొక్లెయినర్ల సాయంతో శిబిరాన్ని కూల్చివేసి లారీలో టెంటు, కుర్చీలు, ఇతర సామాన్లను తరలించారు.కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ఢిల్లీ లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సీఏఏ వ్యతిరేక నిరసన శిబిరాన్ని తొలగించామని పోలీసులు చెప్పారు.  

Updated Date - 2020-03-24T14:30:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising