ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణం: ఏడేళ్ల బాలికపై అఘాయిత్యం

ABN, First Publish Date - 2020-07-03T13:14:54+05:30

పుదుకోట జిల్లా అరన్‌తాంగి సమీపంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: పుదుకోట జిల్లా అరన్‌తాంగి సమీపంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. అవుండయార్‌కోయిల్ తాలూకాకు చెందిన ఏడేళ్ల బాలిక మంగళవారం నుంచి కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం సాయంత్రం గాయాలతో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించి, పోస్టుమార్టం నిమిత్తం పుదుకోట ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. సంఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ అరుణ్ శక్తికుమార్ పరిశీలించి, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. అరన్‌తాంగి డీఎస్పీ బాలమురగన్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక పోలీస్ బృందం.. బాలిక పక్క ఇంట్లో ఉంటున్న పూల వ్యాపారి రాజేష్‌(27)ను అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా, గురువారం బాలిక మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టంలో బాలిక అత్యాచారానికి గురై హత్యకు గురైందని నిర్ధారించారు. ఈ వ్యవహారంలో బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు రాజేష్ అంగీకరించాడు. దీంతో ఈ ఘటనలో పరారీలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా ఈ ఘటనను జాతీయ పిల్లల హక్కుల భద్రత సంఘం సమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.


చట్టపరమైన చర్యలు: సీఎం

బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన వారికి చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు చేపడతామని సీఎం ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు. ఈ మేరకు సీఎం తన ట్విట్టర్‌లో.. ఈ ఘటన తన మనసును ఎంతో బాధించిందని.. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు.

Updated Date - 2020-07-03T13:14:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising