ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెలుగు చూసిన కొత్త కేసులు.. కీలక నిర్ణయం తీసుకున్న సియోల్

ABN, First Publish Date - 2020-05-09T23:58:46+05:30

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో కొత్తగా 18 కోవిడ్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో కొత్తగా 18 కోవిడ్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భౌతిక దూరం నిబంధనలను ప్రభుత్వం సడలించడంతో గత వారం క్లబ్బులు తెరుచుకున్నాయి. తాజాగా వెలుగుచూసిన కేసులకు క్లబ్బులకు సంబంధం ఉండడంతో రాజధానిలోని 2,100 నైట్ క్లబ్‌లు, హోస్టెస్ బార్లు, డిస్కోలను మూసివేసింది.


నైట్‌లైఫ్‌కు ప్రసిద్ధి చెందిన ఇటావాన్‌కు గత వారం 29 ఏళ్ల క్లబ్ గోయర్ వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం వెలుగుచూసిన కేసులకు, అతడికి సంబంధం ఉందని తేలడంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధాని చుంగ్ సైక్యున్ చెప్పారు. క్లబ్‌లతో ముడిపడి ఉన్న అంటువ్యాధులు ప్రబలకుండా సియోల్ ఆపగలదా అనే దానిపైనే దక్షిణ కొరియా క్వారంటైన్ విజయం సాధించిందా? విఫలమైందా? అన్నది ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-05-09T23:58:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising