ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతనివి తప్పుడు ఆరోపణలు: సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా

ABN, First Publish Date - 2020-11-30T04:22:06+05:30

వ్యాక్సిన్‌ తయారీ దిగ్గజం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలంటూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యాక్సిన్‌ తయారీ దిగ్గజం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలంటూ ఓ వలంటీర్‌ పంపిన లీగల్‌ నోటీసుపై సీరం తీవ్రంగా స్పందించింది. అతనివి తప్పుడు ఆరోపణలని సీరమ్ తెలిపింది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్టు అతని చెప్పిన విషయంలో వాస్తవం లేదని, అవి దురుద్దేశపూర్వకంగా చేసిన నిరాధార ఆరోపణలని సీరమ్ వెల్లడించింది. కంపెనీ పరువుప్రతిష్టలకు భంగం కలిగించేందుకే అతను ఈ ఆరోపణలు చేశాడని, అందుకు ప్రతిగా అతనిపై 100 కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్లు సీరమ్ తెలిపింది. అతని ఆరోపణలను సీరమ్ తీవ్రంగా ఖండించింది.


కంపెనీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ ‘కోవిషీల్డ్‌’ మూడో దశ ట్రయల్స్‌లో పాల్గొన్న తనకు తీవ్రమైన తలనొప్పి వచ్చిందని, ప్రశ్నలకు స్పందించలేకపోయానని చెన్నైకి చెందిన ఓ వాలంటీర్ నోటీసులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కంపెనీ బయటకు వెల్లడించలేదన్నారు. వ్యాక్సిన్‌ను వలంటీర్‌ అక్టోబరు 1, 11న తీసుకున్నట్టు పేర్కొన్నారు. నోటీసు ఈనెల 21న పంపించామని, కంపెనీ స్పందన తర్వాత కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేస్తామన్నారు.

Updated Date - 2020-11-30T04:22:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising