ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా... భయపెడుతున్న సెప్టెంబర్

ABN, First Publish Date - 2020-07-14T01:02:46+05:30

రోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో... రాష్ట్రాల ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రజల్లోనూ కరోనా భయం తారస్థాయిలోనే ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో... రాష్ట్రాల ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రజల్లోనూ కరోనా భయం తారస్థాయిలోనే ఉంది. 


భారతదేశంలో కోటికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇరవై వేల వరకు మరణాలు సంభవించాయి. రానున్న రోజుల్లో... ఈ వైరస్ ప్రభావం మరింతగా ఉండే అవకాశం ఉందని సమాచారం. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సమయంలో మాత్రం కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. అయితే... లాక్‌డౌన్ ఎత్తివేసిన దగ్గరనుంచి... పరిస్థితి అదుపు చేయడం కష్టతరంగా మారింది. ఒక్క జూన్ నెలలోనే నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.


ఈ సమయంలోనే ఈ వైరస్ మహమ్మారి గురించి మరో సంచలన విషయం బయటపడింది. సెప్టెంబర్ వరకు ఈ కరోనా ప్రభావం ఇంత కంటే తీవ్ర స్థాయిలో ఉంటుందని, సెప్టెంబర్ నెలలో ఊహించని స్థాయిలో ఉంటుందని సమాచారం. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య బాగా పెరుగుతుందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది.


ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరో సారి లాక్‌డౌన్ విధిస్తారా అనే చర్చ కూడా మొదలైంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ నెల 31 వ తేదీ వరకు లాక్‌డౌన్ ప్రకటించాయి కూడా. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రెండు లక్షలు దాటగా, తమిళనాడులో లక్ష కేసులకు పైనే నమోదయ్యాయి. ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో చాలా రాష్ట్రాలు... మరోసారి పూర్తిగా లాక్‌డౌన్ విధించాలని కోరుతున్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ విషయంపై పూర్తి స్థాయిలో కసరత్తు మొదలు పెట్టారు. రోజురోజుకూ పరిస్థితి చేయి దాటి పోతున్నట్టుగా కనిపిస్తుండడంతో... కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది. 


ఈ పరిస్థితిని అదుపు చేయకపోతే... ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడటంతో పాటు, కేంద్రం అభాసుపాలయ్యే పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలో... తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం ద‌ృష్టి సారించినట్లు సమాచారం. 

Updated Date - 2020-07-14T01:02:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising