ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ-ఘజియాబాద్ సరిహద్దుల్లో భారీ సాయుధ పోలీసుల భద్రత

ABN, First Publish Date - 2020-02-28T12:34:08+05:30

ఢిల్లీలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో సున్నిత ప్రాంతాలైన ఢిల్లీ -ఘజియాబాద్ సరిహద్దుల్లో భారీ సాయుధ పోలీసుబలగాలను మోహరించారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్) : ఢిల్లీలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో సున్నిత ప్రాంతాలైన ఢిల్లీ -ఘజియాబాద్ సరిహద్దుల్లో  భారీ సాయుధ పోలీసుబలగాలను మోహరించారు. శుక్రవారం ఘజియాబాద్ మసీదుల్లో జుమ్మా ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా ఉత్తరప్రదేశ్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘజియాబాద్ నగరాన్ని 18 సెక్టార్లు, 56 జోన్లుగా విభజించి ఆయా ప్రాంతాల్లో గస్తీ కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను రంగంలోకి దించినట్లు ఘజియాబాద్ జిల్లా అదనపు మెజిస్ట్రేట్ శైలేంద్రకుమార్ చెప్పారు. ఘజియాబాద్ నగరానికి చెందిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకున్నామని పోలీసులు చెప్పారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఎలాంటి అల్లరి మూకలు దాడులు చేయకుండా తాము కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఘజియాబాద్ ఎస్పీ కల్ నిధి చెప్పారు. లోని సరిహద్దుప్రాంతంలో రాత్రివేళ ఓ ఆటో డ్రైవరును కొందరు అల్లరి మూకలు కొడుతుండగా కాపాడి అతన్ని ఆసుపత్రికి తరలించామని పోలీసులు చెప్పారు. ఢిల్లీలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్నామని జిల్లా మెజిస్ట్రేట్ శంకర్ పాండే చెప్పారు.

Updated Date - 2020-02-28T12:34:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising