ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరిగొచ్చిన రెండో విమానం.. చైనా నుంచి మరో 323మంది..

ABN, First Publish Date - 2020-02-02T23:06:16+05:30

కరోనా వైరస్‌తో వణికిపోతున్న చైనా నుంచి భారతీయులను రక్షించడానికి ప్రభుత్వం చకచకా చర్యలు తీసుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైరస్‌తో వణికిపోతున్న చైనా నుంచి భారతీయులను రక్షించడానికి ప్రభుత్వం చకచకా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఎయిరిండియాకు చెందిన రెండు విమానాలను ప్రత్యేకంగా చైనా పంపించింది. వాటిలో మొదటిది 324మందితో శనివారం భారత్‌కు చేరింది. దానిలోని భారతీయులను రెండు క్వారంటైన్ సెంటర్లలో ఉంచామని, పరిస్థితిని అంచనా వేసిన తర్వాత వారిని ఇళ్లకు పంపించేస్తామని అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే రెండో ఎయిరిండియా విమానం ఆదివారం ఢిల్లీకి చేరుకుంది. దీనిలో మరో 323మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. అయితే విపరీతమైన జ్వరంతో నలుగురు భారతీయులు బాధపడుతున్నారని, వారిని విమానంలో ఎక్కించుకోలేదని అధికారులు స్పష్టంచేశారు. వీరితోపాటు మాల్దీవులకు చెందిన మరో ఏడుగురు ఈ విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది. వూహాన్ నుంచి తమ పౌరులను కాపాడినందుకు మాల్దీవులు ప్రధాని భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-02-02T23:06:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising