ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ‌రీరంలో క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టే యాంటీబాడీ ఆవిష్క‌ర‌ణ

ABN, First Publish Date - 2020-05-05T15:32:35+05:30

కరోనా వైరస్ శరీరంలో వ్యాప్తి చెందకుండా నిరోధించే ప్రతిరోధకాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. త‌ద్వారా కోవిడ్‌-19 నివార‌ణ‌కు మెరుగైన టీకాలు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండ‌న్‌: కరోనా వైరస్ శరీరంలో వ్యాప్తి చెందకుండా నిరోధించే ప్రతిరోధకాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. త‌ద్వారా కోవిడ్‌-19 నివార‌ణ‌కు మెరుగైన టీకాలు తయారు చేయగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నూత‌నంగా రూపొందించిన ఈ యాంటీబాడీకి 47 డి 11 అని శాస్త్ర‌వేత్త‌లు పేరు పెట్టారు. ఈ యాంటీబాడీని కనుగొన్న నేప‌ధ్యంలో... శరీరంలోని కరోనా వైరస్‌ను క్రియారహితం చేయగలమ‌ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  ఈ యాంటీబాడీ కరోనా వైరస్‌ను ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాపించ‌కుండా చూస్తుంది. ఎలుకలపై ఈ యాంటీబాడీ  ప‌రీక్ష‌లు విజయవంతమయ్యాయి. ఐరోపాలోని శాస్త్రవేత్తలు ఎలుకలలో కనిపించే 51 సెల్ లైన్ల కణాలలో ఈ యాంటీబాడీని కనుగొన్నారు. తరువాత ఇది మ‌నుషుల‌కు ఉప‌యుక్త‌మ‌య్యేలా జన్యుపరంగా ఇంజనీరింగ్ చేశారు. కాగా  శాస్త్రవేత్తలు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం కోవిడ్ -19 కూడా సార్స్ వైరస్ కుటుంబానికి చెందిన‌ది. ఈ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన‌ ఉట్రేచ్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ బెరెండ్ జేన్‌ బాష్ మాట్లాడుతూ ఈ యాంటీబాడీ కరోనా వైరస్‌ను తొలగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంద‌న్నారు. ఇది కణాలకు అంటుకునే వైరస్ పొరపై దాడి చేస్తుంద‌న్నారు.  

Updated Date - 2020-05-05T15:32:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising