ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్క కరోనా వైరస్ కణమున్నా గుర్తించొచ్చు.. సైంటిస్టుల కొత్త ప్రయోగం!

ABN, First Publish Date - 2020-11-29T21:05:40+05:30

వేగంగా కరోనా టెస్టులు నిర్వహించి రోగులను గుర్తించడమనేది వైరస్ కట్టడికి ఎంతో అవసరం. కరోనా టెస్లుల్లో వేగంగా ఫలితాలు రాబట్టేందుకు సైంటిస్టులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: వేగంగా కరోనా టెస్టులు నిర్వహించి రోగులను గుర్తించడమనేది వైరస్ కట్టడికి ఎంతో అవసరం. దీంతో వేగంగా ఫలితాలు ఇచ్చే కరోనా టెస్టులు రూపొందించేందుకు సైంటిస్టులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా జపాన్ శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణకు చేశారు. ఒక్క కరోనా కణాన్ని కూడా గుర్తించ గలిగే కొత్త విధానాన్ని వారు రూపొందించారు. అతి సూక్ష్మ రంధ్రాలున్న జాలీలో నుంచి వైరస్ కణాలను పంపించడం ద్వారా వైరస్‌ను గుర్తించే పద్ధతిని తయారు చేశారు. ఈ విధానంలో భాగంగా.. జాలీలోని విద్యుత్ ప్రవాహంలో జరిగే మార్పుల ఆధారంగా వారు వైరస్‌ కణాలను గుర్తించారు. ఈ పద్ధతి ద్వారా కనిష్టంగా ఒక్క వైరస్ కణాన్ని కూడా గుర్తించొచ్చని వారు చెబుతున్నారు. ఓసాకా యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ఏసీఎస్ సెన్సర్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. భవిష్యత్తులో.. మరింత వేగంగా కచ్చితమైన ఫలితాలను ఇచ్చే కరోనా టెస్టులను రూపొందించేందుకు ఈ పద్ధతి కొత్త దారి పరుస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-11-29T21:05:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising