ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వందల దోమలతో కుట్టించుకుంటున్న ఓ వ్యక్తి.. విషయం ఏంటంటే?

ABN, First Publish Date - 2020-10-01T22:34:39+05:30

రోజుకి నాలుగైదు సార్లు దోమ కరిస్తేనే తట్టుకోలేము. అలాంటిది ఓ వ్యక్తి కొన్ని వందల, వేల దోమలతో కుట్టించుకుంటున్నారు. ఇదేదో వెర్రితనంతో కాదు.. పైన చెప్పిన రోగాలకు కారణాలను తెలుసుకునేందుకు ఓ శాస్త్రవేత్త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దోమ.. చాలా చికాకు కలిగించే ప్రాణి. అంతే కాదు, చాలా రోగాలకు కారణమయ్యే జీవి. మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా, యెల్లో ఫీవర్, జికా వైరస్, ఎన్సెఫెలిటీస్, జపనీస్ ఎన్సెఫెలిటీస్ లాంటి ఎన్నో రోగాలు దోమలే ప్రధాన కారణం. వీటితో పాటు ఎన్నో ప్రమాదకరమైన వైరస్‌లను కూడా దోమలు మోసుకొస్తుంటాయి. మనిషిని కుట్టి రక్తం తాగుతూనే మనిషి శరీరంలో ప్రమాదకర వైరస్‌లను విడిచి వెళ్తుంటాయి. ఓ సర్వే తెలిపిన వివరాల ప్రకారం.. షార్క్‌ల కంటే ఎక్కువగా మనుషుల్ని దోమలే చంపుతున్నాయని, చంపగలవని తెలిపింది.


రోజుకి నాలుగైదు సార్లు దోమ కరిస్తేనే తట్టుకోలేము. అలాంటిది ఓ వ్యక్తి కొన్ని వందల, వేల దోమలతో కుట్టించుకుంటున్నారు. ఇదేదో వెర్రితనంతో కాదు.. పైన చెప్పిన రోగాలకు కారణాలను తెలుసుకునేందుకు ఓ శాస్త్రవేత్త ఇలా చేస్తున్నారు. జీవితాల్ని పణంగా పెట్టి ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు అనేక మంది ఉన్నారు. అందులో ఈయనను ఒకరిగా పేర్కొనవచ్చు. పేరు పెరాన్ రాస్. దోమల నుంచి వ్యాపించే రోగాల మీద పరిశోధన చేయడానికి వందల దోమలతో కరిపించుకుంటున్నారు. ముఖ్యంగా డెంగ్యూ, జికా సహా ఇతర వైరస్ వ్యాప్తులపై ప్రధానంగా పరిశోధన చేస్తున్నారట.


ఈ విషయమై ఆయన ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ‘‘దోమల సంతోనోత్పత్తి గురించి జరిగిన ప్రయోగం త్వరలోనే బయటికి వస్తుంది’’ అని రాసుకొచ్చారు.

Updated Date - 2020-10-01T22:34:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising