పాఠశాలకు ఆర్మీ అమరవీరుడి పేరు: సీఎం
ABN, First Publish Date - 2020-06-19T01:13:00+05:30
చైనా బలగాలతో చోటుచేసుకున్న ఘర్షణలో అమరుడైన ఛత్తీస్‌గఢ్ సాహస సైనికుడు గణేష్ రామ్ కుంజమ్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘన..
రాయపూర్: చైనా బలగాలతో చోటుచేసుకున్న ఘర్షణలో అమరుడైన ఛత్తీస్‌గఢ్ సాహస సైనికుడు గణేష్ రామ్ కుంజమ్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘన నివాళులర్పించింది. రాష్ట్రంలోని ఒక పాఠశాలకు గణేష్ రామ్ కుంజమ్ పేరు పెడతామని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గురువారంనాడు ప్రకటించారు.
రాయపూర్‌కు గురువారం చేరుకున్న కుంజమ్ భౌతికకాయంపై సీఎం పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కుంజమ్ కుటుంబ సభ్యులకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కూడా ఓ ట్వీట్‌లో సీఎం పేర్కొన్నారు.
Updated Date - 2020-06-19T01:13:00+05:30 IST