ఆగస్టు 31లోగా ఆ కేసు సంగతి తేల్చండి.. సీబీఐ కోర్టుకు సుప్రీం ఆదేశం..
ABN, First Publish Date - 2020-05-09T18:43:45+05:30
ఆగస్టు 31లోగా బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో విచారణను పూర్తిచేసి తీర్పు వెలువరించాలంటూ...
న్యూఢిల్లీ: ఆగస్టు 31లోగా బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో విచారణను పూర్తిచేసి తీర్పు వెలువరించాలంటూ లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అడ్వాణీ, ఎంఎం జోషి, ఉమా భారతి సహా పలువురు ఈ కేసులో నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 18 నాటికి బాబ్రీ కేసులో విచారణ పూర్తిచేయాలంటూ గతేడాది జూలైలో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే మరికొంత సమయం కావాలంటూ న్యాయమూర్తి కోరడంతో తాజాగా గడువు పొడిగిస్తూ జస్టిస్ ఆర్ఎఫ్ నారిమాన్, జస్టిస్ సూర్యకాంత్‌ల నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31 లోగా విచారణ పూర్తిచేయాలంటూ జిల్లా, సెషన్స్ జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్‌ను ఆదేశించింది.
Updated Date - 2020-05-09T18:43:45+05:30 IST