ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింజ్రా తోడ్ కార్యకర్తపై పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం

ABN, First Publish Date - 2020-10-29T01:08:35+05:30

ఈశాన్య ఢిల్లీలో సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలో పాల్గొన్నారంటూ వచ్చిన ఆరోపణలతో కలిత, నర్వాల్‌‌లను మార్చి 23న అరెస్ట్ చేశారు. జఫరాబాద్ సిట్-ఇన్ నిరసనలో వారి పాత్ర ఉందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పింజ్రా తోడ్ కార్యకర్త దేవంగన కలితకు బెయిల్ రద్దు చేయాలంటూ వచ్చిన పిటిషన్‌ను విచారణకు తీసుకునేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఢిల్లీ పోలసులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో మార్చిలో కలితను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా కలితకు ఢిల్లీ హైకోర్టు మేలో బెయిల్ మంజూరు చేసింది.


‘‘ఈ విషయంలో మేము చొరవ తీసుకోవాలని అనుకోవడం లేదు. ఆమెకు ఇది వరకే బెయిల్ లభించింది. అమె ఎక్కడికీ పారిపోదు. అందుకే ఈ పిటిషన్‌ను తిరస్కరించాం’’ అని జస్టిస్ అశోక్ భూషన్ అన్నారు.


ఈశాన్య ఢిల్లీలో సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలో పాల్గొన్నారంటూ వచ్చిన ఆరోపణలతో కలిత, నర్వాల్‌‌లను మార్చి 23న అరెస్ట్ చేశారు. జఫరాబాద్ సిట్-ఇన్ నిరసనలో వారి పాత్ర ఉందని ఆరోపణలు రావడంతో ఢిల్లీ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కాగా, మరుసటి రోజే బెయిల్ పొందారు. వారు బయటికి వచ్చిన నిమిషాల్లోనే వీరిద్దరిపై హత్యాయత్నం, అల్లర్లు, నేరపూరిత కుట్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిని మళ్లీ అరెస్టు చేశారు.

Updated Date - 2020-10-29T01:08:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising