ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముఫ్తీ గృహ నిర్బంధం కేసు: జమ్మూ కశ్మీర్ యంత్రాంగానికి సుప్రీం నోటీసులు

ABN, First Publish Date - 2020-09-29T23:17:09+05:30

జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధంపై అక్కడి అధికార యంత్రాంగానికి ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధంపై అక్కడి అధికార యంత్రాంగానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జమ్మూ కశ్మీర్ ప్రజా భద్రత చట్టం కింద ఆమెను నిర్బంధంలోని ఉంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై రెండు వారాల్లోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది. ‘‘ముఫ్తీని ఇంకా ఎంతకాలం నిర్బంధంలో ఉంచుతారు?’’, ‘‘ఆమెను నిర్బంధంలో కొనసాగించడం మీ వెనుక ఉద్దేశ్యం ఏమిటి?’’ అని సర్వోన్నత ధర్మాసనం ప్రశ్నించింది. మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా  దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఇవాళ జస్టిస్ ఎస్‌కే కౌల్, హృషికేష్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పీడీపీ అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతించాలంటూ అధికారులను సంప్రదించాలని ముఫ్తీకి సూచించింది. నిర్బంధంలో ఉన్న ముఫ్తీని కలుసుకునేందుకు ఇల్తిజా, ఆమె సోదరుడికి అనుమతి ఇచ్చింది. గతేడాది ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్న సందర్భంగా పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబాను గృహ నిర్బంధంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2020-09-29T23:17:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising