ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌బీఐ కొత్త ఈ కామర్స్ పోర్టల్ త్వరలో...

ABN, First Publish Date - 2020-07-01T00:11:42+05:30

స్టేట్ బ్యాం ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఓ సరికొత్త ఈ-కామర్స్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలోనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశముంది. బ్యాంక్ చైర్మన్ రజనీష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : స్టేట్ బ్యాం ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఓ సరికొత్త ఈ-కామర్స్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలోనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశముంది. బ్యాంక్ చైర్మన్ రజనీష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. 


అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త ఈకామర్స్ పోర్టల్‌ను తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. సూక్ష్మ, స్థూల, మధ్యతరహా పరిశ్రమలు  ఉత్పత్తుల విక్రయానికి ఈ పోర్టల్‌ వేదికంగా ఉపయోగపడుతుందని రజ్‌నీష్ కుమార్ తెలిపారు. దీని పేరు ‘భారత్ క్రాఫ్ట్’. బ్యాంకు, ప్రభుత్వం రెండూ కలిసి ఈ పోర్టల్‌ను నిర్వహించనున్నాయి. ‘ఇప్పటికే పని జరుగుతోంది. పోర్టల్‌కు సంబంధించి నమూనా ఏర్పాటైంది. ఫ్లాట్‌ఫామ్ రూపకల్పన పనులు త్వరలోనే ప్రారంభమౌతాయి’ అని రజ్‌నీష్ కుమార్ తెలిపారు.


సీఐఐ నిర్వహించిన ఒక వెబినార్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కూడా ఈ పోర్టల్‌ గురించి గతంలో తెలియజేశారు. అయితే కొత్త ఈ కామర్స్ పోర్టల్ ఎప్పటి నుంచి అందుబాటులోక వస్తుందో రజ్‌నీష్ కుమార్ తెలియజేయలేదు. ఈ పోర్టల్ అందుబాటులోకి వస్తే ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం కలుగనుంది. వారి ప్రొడక్టులరె వారే సొంతంగా పోర్టల్‌లో విక్రయించుకోవడానికి వీలవుతుంది. దేశవ్యాప్తంగా మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. 


Updated Date - 2020-07-01T00:11:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising