ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శశికళ జైలు నుంచి రిలీజ్ అవ్వగానే ఏం చేయబోతున్నారు!?

ABN, First Publish Date - 2020-12-30T15:05:40+05:30

నాలుగేళ్లుగా బెంగుళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : అక్రమార్జన కేసులో నాలుగేళ్లుగా బెంగుళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ జనవరి 27న విడుదల కానున్నారు. కానీ, ఆమె ఇప్పటికే 129 రోజులు విచారణ సమయంలో జైలులో వుండడంతో ఆ కాలాన్ని శిక్ష కాలం నుంచి మినహాయించాలని ఆమె తరఫు న్యాయవాది జైలు అధికారులకు విన్నవించినా, వారి  నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. ఈ విషయమై శశికళ తరఫు న్యాయవాది రాజాసెంతూర్‌పాండియన్‌ జైలు అధికారులకు రాసిన లేఖలో, బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో 2017 నుంచి ఇప్పటివరకు ముందుగానే విడుదలైన వారి పేర్లు ఉదాహరణలుగా చూపారు.


వారిని విడుదల చేసినట్టే శశికళను ముందుగానే విడుదల చేయాలని లేఖలో కోరారు. ఆ లేఖపై జైలు అధికారుల నుంచి ఎలాంటి బదులు రాలేదు. ఈ నేపథ్యంలో, మళ్లీ న్యాయవాది రాజాసెంతూర్‌పాండియన్‌ జైలు అధికారులకు మరో లేఖ జైలు అధికారులు ఉన్నతాధికారులకు ఉన్నతాధికారులకు పంపించామని సమాధానమిచ్చారు. ఈ విషయమై న్యాయవాది రాజాసెందూర్‌ పాండియన్‌ మాట్లాడుతూ, శశికళ జనవరి 27వ తేదీ జైలు నుంచి విడుదలవుతారని ఇప్పటికే జైలు అధికారులు తెలిపారని, కానీ, ఆమె ముందుగానే విడుదలయ్యేందుకు అవకాశముందని తాము భావించామని, త్వరలో వారి నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నామన్నారు. జైలు నుంచి విడుదలయ్యే శశికళ తొలుత జయలలిత సమాధి వద్ద వెళ్లి శపథం చేసిన అనంతరమే ఇంటికి వెళ్లనున్నారని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.

Updated Date - 2020-12-30T15:05:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising