ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శశికళతో భేటీకి అనుమతి నిరాకరణ

ABN, First Publish Date - 2020-09-18T16:30:24+05:30

బెంగళూరు పరపన అగ్రహారం జైలులో ఉన్న శశికళను కలుసుకునేందుకు కర్నాటక జైళ్ళ శాఖ అధికారులు అనుమతి నిరాకరించినట్టు ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్‌ పాండ్యన్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై (ఆంధ్రజ్యోతి) : బెంగళూరు పరపన అగ్రహారం జైలులో ఉన్న శశికళను కలుసుకునేందుకు కర్నాటక జైళ్ళ శాఖ అధికారులు అనుమతి నిరాకరించినట్టు ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్‌ పాండ్యన్‌ తెలిపారు. అక్రమార్జన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఈ నెలాఖరులోగా విడుదలవుతారని పాండ్యన్‌ చెబుతుండగా, కర్నాటక జైళ్ళ శాఖ ఉన్నతాధికారులు వచ్చే యేడాది జనవరి 27న ఆమె విడుదలయ్యే అవకాశముందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో శశికళను కలుసుకునేందుకు పాండ్యన్‌ ఆ రాష్ట్ర జైళ్ల శాఖ అధికారుల అనుమతి కోసం దరఖాస్తు చేయగా దానిని తిరస్కరించారు. ఈ విషయాన్ని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలిపారు. కర్నాటకలో కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి కారణంగా జైలులో ఉన్న ఖైదీలను ఎవరూ కలుసుకోకుండా కట్టుదిట్టం చేయడం వల్లే తనకు అనుమతి నిరాకరించారని పాండ్యన్‌ తెలిపారు. జైలులో శశికళ ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో వున్నారో తెలుసుకోవడానికే ఆమెను కలుసుకు నేందుకు తాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ఆయన చెప్పారు. శశికళను త్వరగా జైలు నుంచి విడుదల చేయించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నానని, సుప్రీం కోర్టు విధించిన రూ.10 కోట్ల జరిమానా ఏ సమయంలోనైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. జరిమానా చెల్లించిన వెంటనే శశికళను విడుదల చేయించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనకు తెలిసినంతవరకూ శశికళ అక్టోబర్‌ నెలాఖరు లోగా విడుదలయ్యే అవకాశాలున్నాయని పాండ్యన్‌ వెల్లడించారు.

Updated Date - 2020-09-18T16:30:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising