పార్టీలో, ప్రభుత్వంలో శశికళకు చోటు లేదు : మంత్రి జయకుమార్
ABN, First Publish Date - 2020-07-11T02:25:19+05:30
శశికళ కుటుంబానికి అన్నా డీఎంకేలో చోటు లేదని తమిళనాడు మంత్రి జయకుమార్ తేల్చి చెప్పారు.
చెన్నై : శశికళ కుటుంబానికి అన్నా డీఎంకేలో చోటు లేదని తమిళనాడు మంత్రి జయకుమార్ తేల్చి చెప్పారు. ‘‘శశికళకు గానీ, ఆమె కుటుంబ సభ్యులకు గానీ అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో చోటు లేదు. ఇది పార్టీ స్థిరమైన అభిప్రాయం’’ అని ఆయన ప్రకటించారు. వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఆగస్టు 14న జైలు నుంచి విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయంటూ ఆమె సన్నిహితులు ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే దీనిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు.
Updated Date - 2020-07-11T02:25:19+05:30 IST