ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాజ్‌వాదీ ఎంపీ కుమారుడిపై యూపీ సర్కారు సంచలన నిర్ణయం

ABN, First Publish Date - 2020-09-25T12:37:42+05:30

సమాజ్‌వాదీ ఎంపీ ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లాఖాన్ ఎన్నికల్లో పోటీచేయకుండా 6 ఏళ్లపాటు నిషేధం విధించాలని....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబ్దుల్లాఖాన్ ఎన్నికల్లో పోటీచేయకుండా 6 ఏళ్లపాటు నిషేధం

న్యూఢిల్లీ : సమాజ్‌వాదీ ఎంపీ ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లాఖాన్ ఎన్నికల్లో పోటీచేయకుండా 6 ఏళ్లపాటు నిషేధం విధించాలని ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సచివాలయం భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు తాజాగా లేఖ రాసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 ఎకింద అబ్దుల్లాఖాన్ ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని యూపీ అసెంబ్లీ సెక్రటేరియెట్ రాష్ట్రపతికి సిఫారసు చేసింది. యూపీ అసెంబ్లీ సెక్రటేరియెట్ పంపిన లేఖ ఆధారంగా రాష్ట్రపతి కేంద్ర ఎన్నికల కమిషన్ సమ్మతితో అబ్దుల్లాఖాన్ ఆరేళ్లపాటు ఏ ఎన్నికల్లోనూ పోటీచేయకుండా నిషేధాస్త్రం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. 


తన పుట్టినతేదీకి సంబంధించిన వాస్తవాలను తప్పుగా చిత్రీకరించినందుకు యూపీలోని రాంపూర్ జిల్లా సువార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అబ్దుల్లాఖాన్ ఎన్నికను అలహాబాద్ హైకోర్టు రద్దు చేసిందని యూపీ సచివాలయం రాష్ట్రపతికి రాసిన లేఖలో తెలిపింది. సువార్ అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యూపీ సర్కారు అబ్దుల్లాఖాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధాస్త్రం విధించింది. 2017లో ఎన్నికలు జరిగినపుడు 25 ఏళ్ల లోపు ఉన్న అబ్దుల్లా పుట్టినతేదీని మార్చారని యూపీ సర్కారు పేర్కొంది. 

Updated Date - 2020-09-25T12:37:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising