ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వికాస్ దూబే ఇంటిని ఏ చట్టం ప్రకారం కూల్చేశారు?: కాంగ్రెస్

ABN, First Publish Date - 2020-07-07T04:39:13+05:30

లక్నో: గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఇంటిని ఏం చట్టం ప్రకారం కూల్చేశారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో డీసీపీ, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్ల మృతికి కారణమైన కరడుగట్టిన నేరస్థుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఇంటిని ఏం చట్టం ప్రకారం కూల్చేశారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో డీసీపీ, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్ల మృతికి కారణమైన కరడుగట్టిన నేరస్థుడు వికాస్‌ దూబే ఇంటిని కూల్చడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ తప్పుబట్టారు. ఏం చట్టం ప్రకారం దూబే ఇంటిని కూల్చారని ఆయన ప్రశ్నించారు. కంటికి కన్ను అనే విధానంతో వెళ్తే ప్రపంచమంతా గుడ్డిదైపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దూబే ఇంటిని కూల్చాల్సింది కాదన్నారు. యోగి ప్రభుత్వ నిర్ణయం తప్పని సల్మాన్ ఖుర్షీద్ విమర్శించారు.



దూబే ఇంటి గోడల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నట్లు అనుమానించిన పోలీసులు జేసీబీల సాయంతో ఇంటిని కూల్చేశారు. మరోవైపు దూబేను అరెస్ట్ చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అటు దూబేకు సహకరించారని ఆరోపణలొస్తున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. దూబే సమాచారం ఇచ్చిన వారికి రెండున్నర లక్షల రూపాయల బహుమతి ఇస్తామని యూపీ పోలీసులు ప్రకటించారు. 

Updated Date - 2020-07-07T04:39:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising