ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్-19: పోలీసుల చేతికి వాట్సాప్ గ్రూప్స్ అడ్మిన్ల వివరాలు

ABN, First Publish Date - 2020-04-04T18:07:05+05:30

కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో పుకార్లు, నకిలీ వార్తలు పోటెత్తుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ హాస్పిటల్ యాజమాన్యం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో పుకార్లు, నకిలీ వార్తలు పోటెత్తుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ హాస్పిటల్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రికి చెందిన అన్ని వాట్సాప్ గ్రూప్‌ల అడ్మిన్ల వివరాలు ఢిల్లీ పోలీసులకు సమర్పించనున్నట్టు ప్రకటించింది. అడ్మిన్ల పేర్లు, మొబైల్ ఫోన్ నంబర్లు, ఈమెయిల్ అడ్రస్‌లు తదితర వివరాలను ఢిల్లీ పోలీసులకు అందించనున్నట్టు తెలిపింది. కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో పుకార్లు, నకిలీ వార్తలకు చెక్ పెట్టేందుకు తమవంతు బాధ్యతగా వాట్సాప్ గ్రూప్ వివరాలను పోలీసులకు అందించనున్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.


కాగా ఢిల్లీలో ఇప్పటి వరకు 386 కరోనా కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 369 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరు పేషెంట్లు వెంటలేటర్‌పై ఉండగా.. మరో 10 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. నగరంలో ఒక్కసారిగా కోవిడ్-19 కేసులు పెరిగిపోవడంతో... దీనికి తగినట్టుగా ఢిల్లీ పోలీసులు, ఆరోగ్య శాఖ మరిన్ని ఏర్పాటు చేపట్టింది. కాగా ప్రస్తుతమున్న 386 కరోనా రోగుల్లో 259 మంది మర్కజ్ నిజాముద్దీన్‌కు వెళ్లిన వారే ఉన్నారని ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-04T18:07:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising