ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎల్పీ మీటింగ్‌కి మళ్లీ డుమ్మా కొట్టిన పైలెట్

ABN, First Publish Date - 2020-07-14T16:54:25+05:30

రాజస్తాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్ రెబల్ నేత సచిన్ పైలెట్ వరుసగా రెండో రోజు డుమ్మా కొట్టారు. భేటీకి రావాలంటూ కాంగ్రెస్ పంపించిన ఆహ్వానాన్ని ఆయన పక్కన పెట్టారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: రాజస్తాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్ రెబల్ నేత సచిన్ పైలెట్ వరుసగా రెండో రోజు డుమ్మా కొట్టారు. భేటీకి రావాలంటూ కాంగ్రెస్ పంపించిన ఆహ్వానాన్ని ఆయన పక్కన పెట్టారు. సచిన్ సహా ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలు ఎవరూ ఈ భేటీకి హాజరు కాలేదు. పలుమార్లు పైలెట్‌తో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.


కాగా సోమవారం జరిగిన మొదటి సమావేశానికి 104 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు. అంతే కాకుండా ఐదుగురు ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా లేఖలు ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. అయితే అవి అవాస్తవమని, తనతో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు పైలెట్ చెప్పుకొచ్చారు. గెహ్లాట్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని సచిన్ చెబుతున్నారు.


పైలెట్ తీరుపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. మరోసారి సచిన్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు, అయినప్పటికీ మాట వినకపోతే పార్టీ నుంచి బహిష్కరించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

Updated Date - 2020-07-14T16:54:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising