ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14 నుంచి అయ్యప్ప దర్శనం

ABN, First Publish Date - 2020-06-07T07:16:17+05:30

సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత నెలవారీ పూజల కోసం శబరిమల ఆలయం తిరిగి తెరుచుకోనుంది. భక్తులకు ఈ నెల 14 నుంచి ఐదురోజుల పాటు అయ్యప్పస్వామి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తెరుచుకోనున్న శబరిమల ఆలయం

తిరువనంతపురం/జమ్మూ, జూన్‌ 6: సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత నెలవారీ పూజల కోసం శబరిమల ఆలయం తిరిగి తెరుచుకోనుంది. భక్తులకు ఈ నెల 14 నుంచి ఐదురోజుల పాటు అయ్యప్పస్వామి దర్శన భాగ్యం కలుగనుంది. అయితే.. భక్తులకు మాస్కుధారణ నిబంధన తప్పనిసరి. స్వామివారి సన్నిధానం వద్దకు ఏకకాలంలో 50 మందినే అనుమతిస్తారు. వారు వెళ్లాకే, మరో బ్యాచ్‌ను పంపుతారు. భక్తులు ముందుగానే ‘వర్చువల్‌ క్యూ’ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలి. దర్శనానికి రెండు స్లాట్లే ఉంటాయి.  ప్రసాదాల కోసం ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలి. ఇతర రాష్ట్రాల భక్తులు కేరళ ప్రభుత్వ ‘జాగ్రత్త’ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేయించుకుని, ఈ-పాస్‌ తీసుకోవాలి. కొవిడ్‌ పరీక్ష చేయించుకుని ఉండాలి.


ఇక కేరళలోని మరో పుణ్యక్షేత్రం గురువాయూర్‌లో భక్తులను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. ఆలయాన్ని తెరిచే తేదీని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. రోజుకు 60 పెళ్లిళ్లకే అనుమతి ఉండనుంది. ఇక అమర్‌నాథ్‌ యాత్ర సమయాన్ని కుదించారు. జూలై 21 నుంచి ఆగస్టు 3 వరకే మంచు లింగ దర్శనానికి అనుమతిస్తారు. కాగా, ఈ నెల 8 నుంచి ప్రార్థనా స్థలాలు తెరిచినా తాము వెళ్లబోమని 57 శాతం మంది ప్రజలు చెప్పినట్లు లోకల్‌సర్కిల్స్‌ జరిపిన ఓ సర్వేలో తేలడం గమనార్హం.  

Updated Date - 2020-06-07T07:16:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising