విదేశాంగ శాఖ బృందానికి జైశంకర్ ప్రశంసలు
ABN, First Publish Date - 2020-06-18T15:24:05+05:30
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) తాత్కాలిక సభ్యదేశంగా భారత్ మరోసారి..
న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) తాత్కాలిక సభ్యదేశంగా భారత్ మరోసారి ఎన్నికైన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ బృందానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అభినందనలు తెలిపారు. తాజా విజయంతో 15 దేశాలు సభ్యులుగా ఉండే యూఎన్ఎస్‌సీలో మరో రెండేళ్ల పాటు భారత్ కొనసాగనుంది. ఈ సందర్భంగా జైశంకర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ..‘‘న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధి, విదేశాంగ శాఖ బృందానికి అభినందనలు. బాగా పనిచేశారు..’’ అంటూ ప్రశంసించారు. ఐరాస జనరల్ అసెంబ్లీలోని మొత్తం 192 ఓట్లకుగాను భారత్‌కు 184 ఓట్లు రావడం విశేషం. భారత్‌తో పాటు ఐర్లాండ్, మెక్సికో, నార్వే కూడా బుధవారం యూఎన్ఎస్‌సీకి ఎన్నికైన దేశాల్లో ఉన్నాయి.
Updated Date - 2020-06-18T15:24:05+05:30 IST