ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుహలోకి ముంచెత్తిన వరద.. చిక్కుకుపోయిన రష్యన్‌ సేఫ్

ABN, First Publish Date - 2020-04-10T01:25:17+05:30

ఉత్తర గోవాలోని కేరి గుహలో చిక్కకుపోయిన రష్యా జాతీయుడిని అధికారులు రక్షించారు. అతడు గత కొన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోవా: ఉత్తర గోవాలోని కేరి గుహలో చిక్కుకుపోయిన రష్యా జాతీయుడిని అధికారులు రక్షించారు. అతడు గత కొన్ని రోజులుగా ఆ గుహలోనే ఉంటున్నట్టు తెలిసింది. రోజువారీ విధుల్లో భాగంగా కేరి బీచ్ ప్రాంతంలోని లైఫ్‌గార్డ్స్ నిర్వహించిన పెట్రోలింగ్‌లో లైఫ్‌గార్డ్ గిరీశ్ టాకర్.. ఇరుకైన గుహలో ఉన్న ఓ వ్యక్తిని గుర్తించాడు. ఆటుపోట్లు అధికంగా ఉండడంతో గుహలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్నట్టు గ్రహించాడు. అతడు దివ్యాంగుడని, నడవలేకపోతున్నాడని గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యాడు. గుహ వద్దకు చేరుకుని అతడిని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం మాపుసా లోని ఆసుపత్రికి తరలించాడు.


అతడి పేరు వ్యాలెంటీ అని, రష్యా జాతీయుడని నిర్ధారించుకున్న అధికారులు రష్యా రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు. కాగా, గోవాలో చిక్కుకుపోయిన చాలామంది విదేశీ పర్యాటకులు బీచ్ పొడవునా ఉన్న హట్‌ (గుడిసెలు)లలో నివసిస్తున్నారు. ఈ మధ్యాహ్నం మోర్జిమ్ ప్రాంతంలో దాదాపు 60 మంది విదేశీయులు పార్టీ చేసుకోవడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

Updated Date - 2020-04-10T01:25:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising