ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చందమామ 3డీ మ్యాప్ సిద్ధం చేస్తున్న రష్యా.. ఎందుకంటే?

ABN, First Publish Date - 2020-03-24T00:16:14+05:30

చందమామపైకి మనుషులను పంపడం ప్రపంచదేశాల కల. దీనికోసం రకరకాల పరిశోధనల జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: చందమామపైకి మనుషులను పంపడం ప్రపంచదేశాల కల. సాధ్యమైనంత త్వరగా చంద్రునిపైకి తమ వ్యోమగాములను పంపాలని ప్రతిదేశమూ ఆరాటపడుతోంది. దీనికోసం రకరకాల పరిశోధనల జరుగుతున్నాయి. అయితే చంద్రుడిపైకి ఎలాగోలా రాకెట్ పంపిస్తే ఎక్కడ ల్యాండ్ చేయాలి? అనేది ఈ పరిశోధనల్లో ప్రతి దేశమూ ఎదుర్కొనే ముఖ్యమైన ప్రశ్న. అయితే ఈ సమస్యకు తాము పరిష్కారం చూపనున్నామని రష్యా ప్రకటించింది. దీనికోసం 3డీలో చందమామ మ్యాప్‌ను తయారు చేస్తున్నట్లు రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ డైరెక్టర్ అనాటలీ పెట్రుకోవిచ్ ప్రకటించారు. ఈ మ్యాప్‌ దాదాపు చంద్రుని ఉపరితలాన్ని పోలి ఉంటుందని తెలిపారు.  అంటే 3డీలో మినీ చందమామను తయారుచేసేస్తున్నారన్నమాట. దీనివల్ల చంద్రుడిపై అంతరిక్ష నౌకలను ఎక్కడ ల్యాండ్ చేయాలో ఓ అంచనాకు రావొచ్చని ఆయన వెల్లడించారు. స్టీరియో ఇమేజింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు పెట్రుకోవిచ్ చెప్పారు. ఇటువంటి చంద్రుడి మ్యాప్ తయారుచేయడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. కాగా, వచ్చే ఏడాది అక్టోబరులో చంద్రుడిపైకి తమ అంతరిక్ష నౌకను పంపాలని రష్యా ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2020-03-24T00:16:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising