ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యా, అమెరికా నుంచి భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తున్న భారత్

ABN, First Publish Date - 2020-06-24T05:18:44+05:30

న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు ఓ పక్క చర్చలు జరుపుతూనే మరో పక్క రష్యా, అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేసేందుకు భారత్ పావులు కదుపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు ఓ పక్క చర్చలు జరుపుతూనే మరో పక్క రష్యా, అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేసేందుకు భారత్ పావులు కదుపుతోంది. రష్యా నుంచి ఎస్-400 మిసైల్ రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించి గత ఏడాదే భారత్ రష్యాకు 40 వేల కోట్లు చెల్లించింది. వీటిని తక్షణమే అందజేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ రష్యాను కోరనున్నారు. ప్రస్తుతం ఆయన రష్యా పర్యటనలో ఉన్నారు.


ఎస్-400 ట్రయంప్ లాంగ్ రేంజ్ మిసైల్ 400 కిలోమీటర్ల వరకూ లక్ష్యాలను చేధించగలదు. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణుల్లో ఒకటైన ఎస్-400 భారత రక్షణ వ్యవస్థలో చేరితే చైనా, పాకిస్థాన్‌లకు చెక్ పెట్టవచ్చు. గతంలో ఎస్-400 కొనుగోలు చేసేందుకు రష్యాకు అడ్వాన్స్ ఇచ్చే సమయంలో అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం చైనాతో ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో అమెరికా మౌనంగానే ఉంది.


అదే సమయంలో అమెరికా నుంచి ఎం-777 హోవిట్జర్ శతఘ్నులను కూడా భారత్ కొనుగోలు చేయనుంది. 777 హోవిట్జర్ శతఘ్నులను హెలికాఫ్టర్లలో కూడా తరలించవచ్చు. ముఖ్యంగా గల్వాన్ లోయలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఈ 777 హోవిట్జర్ శతఘ్నులు తమ సామర్థ్యాన్ని చాటతాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికా నుంచి భారత్ సి- 17 హెలికాఫ్టర్లు కూడా కొనుగోలు చేస్తోంది. 

Updated Date - 2020-06-24T05:18:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising