ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యా వ్యాక్సిన్ కోసం ఆసక్తి చూపుతున్న దేశాలివే!

ABN, First Publish Date - 2020-08-15T01:28:44+05:30

కరోనా వైరస్‌పై పోరులో భాగంగా అందరికంటే ముందే వ్యాక్సిన్ ప్రకటించిన రష్యా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: కరోనా వైరస్‌పై పోరులో భాగంగా అందరికంటే ముందే వ్యాక్సిన్ ప్రకటించిన రష్యా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ వ్యాక్సిన్ అవసరమైన అన్ని పరీక్షలు పూర్తి చేసుకున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే నొక్కి వక్కాణించారు. స్పుత్నిక్-విగా పేరుపెట్టిన ఈ టీకాను గమలేయ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ వ్యాక్సిన్‌ను ఒకసారి తీసుకుంటే కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన రోగనిరోధక శక్తిని రెండేళ్లపాటు అందిస్తుంది.  


జూన్ 17న ఈ వ్యాక్సిన్‌ను మానవులపై పరీక్షించారు. మొత్తం 76 మంది వలంటీర్లకు దీనిని ఇవ్వగా సంతృప్తికరమైన ఫలితాలు వచ్చాయి. అయితే, రష్యా స్పుత్నిక్-వి టీకాపై తమకు కచ్చితమైన సమాచారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ సీనియర్ సలహాదారు డాక్టర్ బ్రూస్ అయిల్‌వార్డ్ పేర్కొన్నారు. 


రష్యా వ్యాక్సిన్ సమర్థతపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నప్పటికీ పలు దేశాలు మాత్రం దానిపై ఆసక్తి చూపిస్తున్నాయి. రష్యా టీకాను కొనుగోలు చేసేందుకు వియత్నాం ఇప్పటికే ముందుకొచ్చింది. 50-150 మిలియన్ డోసుల వ్యాక్సిన్ కోసం వియత్నాం ఒప్పందం కుదుర్చుకుంది. రష్యా వ్యాక్సిన్‌ను పరిశీలిస్తున్న ఇజ్రాయెల్ కొనుగోలుకు చర్చలు ప్రారంభించినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. 


రష్యా వ్యాక్సిన్‌కు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు ఫిలిప్పీన్స్ ప్రకటించింది. అక్టోబరులో ట్రయల్స్ ప్రారంభిస్తామని, విజయవంతమైతే వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రజలకు ఇవ్వనున్నట్టు తెలిపింది. మరోవైపు, స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌పై సరైన డేటా లేకపోవడంతో రష్యా డాక్టర్లు కొంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.  

Updated Date - 2020-08-15T01:28:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising