ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 2 వేల నోట్ల ముద్రణ పూర్తిగా నిలిపివేత : ఆర్‌‌టీఐలో వెల్లడి

ABN, First Publish Date - 2020-08-09T18:00:41+05:30

రూ. 500 నోట్ల ముద్రణను ఆర్‌బీఐ క్రమంగా పెంచుతోంది. కిందటి సంవత్సరం రూ. 2 వేల ట్లను ముద్రించని విషయం తెలిసిందే. ఈ క్రమానికి సంబంధించి... సమాచార హక్కు చట్టం ద్వారా జలగం సుధీర్ అనే వ్యక్తి తెలుసుకున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం రూ. వెయ్యి, రూ. 500 నోట్లను రద్దు చేసి, ఆపై రూ. 2000 నోట్లను కేంద్రం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : రూ. 500 నోట్ల ముద్రణను ఆర్‌బీఐ క్రమంగా పెంచుతోంది. కిందటి సంవత్సరం రూ. 2 వేల నోట్లను ముద్రించని విషయం తెలిసిందే. ఈ క్రమానికి సంబంధించి... సమాచార హక్కు చట్టం ద్వారా జలగం సుధీర్ అనే వ్యక్తి తెలుసుకున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం రూ. వెయ్యి, రూ. 500 నోట్లను రద్దు చేసి, ఆపై రూ. 2000 నోట్లను కేంద్రం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.


ఆ తర్వాత... 2016-17 ఆర్ధిక సంవత్సరంలో రూ. 354.29 కోట్లు, 2017-18 లో రూ. 11.15 కోట్లు, 2018-19 లో రూ. 4.66 కోట్ల విలువైన 2 వేల నోట్లను ముద్రించిన ఆర్బీఐ... కిందటి సంవత్సరం మాత్రం ఎటువంటి ముద్రణా కార్యకలాపాలనూ చేపట్టలేదు.


ఇదే సమయంలో రూ. 500 నోట్ల ముద్రణ మాత్రం గణనీయంగా పెరిగింది. 2016-17 లో ముద్రితమైన రూ. 429.22 కోట్ల విలువైన 500 నోట్లతో పోలిస్తే, గత సంవత్సరం దాదాపు రెట్టింపుగా... అంటే... రూ. 822.77 కోట్ల విలువైన ముద్రణ జరిగిందని ఆర్బీఐ వెల్లడించింది.  మొత్తంమీద ఈ నాలుగేళ్లలో రూ. 2,458.57 కోట్ల విలువైన రూ. 500 నోట్లు, రూ. 370.10 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లను ఆర్బీఐ ముద్రించింది.


కాగా... 1, 2, 5 రూపాయల నోట్ల ముద్రణను సైతం ఆర్బీఐ గత నాలుగేళ్లుగా నిలిపివేసింది. ముద్రణ వ్యయం విషయానికొస్తే,,, రూ. 200 నోటుకు అత్యధికంగా ఒక్కో నోటుకు రూ. 2.15 చొప్పున వ్యయమవుతోందని, ఇక... రూ. 500 నోటుకు రూ. 2.13, రూ. 100 నోటుకు రూ. 1.34 చొప్పున ఖర్చవుతోందని వెల్లడించింది. రూ. 50 నోటుకు 82 పైసలు, రూ. 20 నోటుకు 85 పైసలు, రూ. 10 నోటుకు రూ. 75 పైసలు చొప్పున ఖర్చవుతోందని వెల్లడించింది.

Updated Date - 2020-08-09T18:00:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising