ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీఐ న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నాం : సంఘ్

ABN, First Publish Date - 2020-10-01T00:06:29+05:30

బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వాగతించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగపూర్ : బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వాగతించింది. ఈ మేరకు సర్‌కార్యవాహ భయ్యాజీ జోషి ట్వీట్ చేశారు. సవాళ్లను ఎదుర్కోడానికి దేశంలోని అన్ని వర్గాలు సామరస్యం కదలాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.


‘‘బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఆరెస్సెస్ స్వాగతిస్తోంది. దేశముందున్న సవాళ్లను ఎదుర్కోడానికి అన్ని వర్గాలు కలిసి కట్టుగా, సామరస్యంగా ముందకు రావాలి. సవాళ్లను ఎదుర్కొనేందుకు విజయవంతంగా పనిచేయాలి. దేశాన్ని అభివృద్థి పథంలో ముందుకు నడిపించాలి.’’ అని భయ్యాజీ జోషి ట్వీట్ చేశారు.

  


బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు వెలువడింది. మసీదు కూల్చివేత కుట్రకాదని ... కూల్చివేతకు సరైన సాక్ష్యాధారాలు లేవని జడ్జి ఎస్‌కే యాదవ్ పేర్కొన్నారు. 2000 పేజీల తీర్పును న్యాయమూర్తి ఎస్కే యాదవ్ చదివి వినిపించారు. దీంతో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ సహా 32 మంది నిందితులు నిర్దోషులుగా తేలారు. 28 సంవత్సరాల అనంతరం ఈ కేసులో తుది తీర్పు ఇవాళ వెలువడింది. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో 26 మంది కోర్టుకు హాజరు కాగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరుగురు నిందితులు హాజరయ్యారు.

Updated Date - 2020-10-01T00:06:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising