ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా రోగుల చికిత్సకు రంగంలోకి దిగిన రోబోలు

ABN, First Publish Date - 2020-03-26T14:29:25+05:30

కరోనా వైరస్ రోగులకు చికిత్స చేసేందుకు వైద్యులు కొత్తగా రోబోలను రంగంలోకి దించారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్ (రాజస్థాన్): కరోనా వైరస్ రోగులకు చికిత్స చేసేందుకు వైద్యులు కొత్తగా రోబోలను రంగంలోకి దించారు. జైపూర్ నగరంలో సవాయ్ మాన్‌సింగ్ ఆసుప్రతిలో ని కరోనా వైరస్ పాజిటివ్ రోగులకు చికిత్స చేసేందుకు ఉద్దేశించిన ఐసోలేషన్ వార్డులో వైద్యసేవలు అందించేందుకు రోబోట్ లను రంగంలోకి దించామని ఆసుపత్రి డాక్టర్ డీఎస్ మీనా చెప్పారు. జోద్‌పూర్ నగరానికి చెందిన ఓ వ్యక్తి తయారు చేసిన ఈ నర్సింగ్ రోబోలను ఎలాంటి చార్జీలు తీసుకోకుండా పనిచేసేందుకు ఆసుపత్రిలో ప్రవేశపెట్టారని డాక్టర్ మీనా పేర్కొన్నారు.


కరోనా వైరస్ రోగులకు నర్సుల స్థానంలో ఈ రోబోలు వైద్య సేవలు అందిస్తున్నాయని ఆసుపత్రి వైద్యులు చెప్పారు. బుధవారం ఈ రోబోలు కరోనా రోగులకు చికిత్స అందించడంలో విజయవంతం అయ్యాయని డాక్టర్ మీనా వివరించారు. బ్యాటరీతో పనిచేసే ఈ రోబోల జీవిత కాలం 4 నుంచి 5ఏళ్లు అని వైద్యులు చెప్పారు. రోబోలను నర్సింగ్ సేవల కోసం ప్రవేశపెట్టడంతో నర్సులకు కరోనా వైరస్ సోకకుండా సురక్షితంగా ఉండవచ్చని వైద్యులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-26T14:29:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising