ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పది లక్షల ఉద్యోగాలిస్తాం : ఆర్జేడీ మేనిఫెస్టో

ABN, First Publish Date - 2020-10-24T16:31:48+05:30

ఆయా పార్టీల మేనిఫెస్టోలన్నీ ఉద్యోగాల కల్పన చుట్టే తిరుగుతున్నాయి. బీజేపీ 19 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ప్రకటిస్తే, ప్రత్యర్థి ఆర్జేడీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : ఆయా పార్టీల మేనిఫెస్టోలన్నీ ఉద్యోగాల కల్పన చుట్టే తిరుగుతున్నాయి. బీజేపీ 19 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ప్రకటిస్తే, ప్రత్యర్థి ఆర్జేడీ 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ శనివారం తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. 

1. నిరుద్యోగులకు నెల చొప్పున 1,500 రూపాయలు

2. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీతో పాటు ఆస్పత్రుల నిర్మాణం

3. ప్రతి గ్రామంలో కూడా సీసీటీవీల ఏర్పాటు  

4. కొత్త పరిశ్రమల విధానం

5. ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ, ప్రభుత్వ పరీక్షలకు గానీ స్థానికులకు ఫీజుల మినహాయింపు

6. పేదలకు, వృద్ధులకు 1000 రూపాయల పెన్షన్

పది లక్షల ఉద్యోగాల ప్రకటన సాధ్యమయ్యే పనేనని తేజస్వీ ధీమా వ్యక్తం చేశారు. 4 లక్షల ఉద్యోగాలను కచ్చితంగా ఇవ్వగలమని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ 2.13 లక్షల కోట్లని, కానీ 60 శాతం మాత్రం ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మిగితా 40 బడ్జెట్‌ను ఖర్చు చేసే స్థితిలో కూడా సీఎం నితీశ్ లేరని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘బిహార్‌ను అన్ని రంగాల్లోనూ మెరుగ్గా చేయాలన్నది మా ప్రయత్నం. ఇందుకోసం జాతీయ ఉపాధి సగటుతో పోటీ పడాల్సిన అవసరం ఉంది. ఇది మార్పు కోసం మేమిచ్చే వాగ్దానం. ఇదో ప్రతిజ్ఞ. దానిని ఆచరణలోకి తెచ్చి చూపిస్తాం.’’ అని తేజస్వీ ప్రకటించారు. బిహార్‌ను నడిపే శక్తి సీఎం నితీశ్‌కు ఎంత మాత్రమూ లేదని, ఆయన అలిసిపోయారని విమర్శించారు. 

Updated Date - 2020-10-24T16:31:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising