ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1,090 కిలోమీటర్ల రిక్షా ప్రయాణం

ABN, First Publish Date - 2020-05-27T06:50:55+05:30

లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా వలస కార్మికులు నానా కష్టాలు పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రామిక్‌ రైలుపై ఆశలు వదులుకొని 

గుర్గావ్‌ నుంచి బిహార్‌ చేరుకున్న రిక్షా పుల్లర్లు 


గుర్గావ్‌, మే 26:  లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా వలస కార్మికులు నానా కష్టాలు పడుతున్నారు.  గుర్గావ్‌లోని 11 మంది రిక్షా పుల్లర్లు బిహార్‌లోని తమ సొంత జిల్లా ముజఫర్‌పూర్‌కు  ప్రత్యేక శ్రామిక్‌ రైలులో వెళ్లడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. రెండు నెలల నుంచి అద్దె కట్టనందున గది ఖాళీ చేశారు. చేతిలో రూపాయి లేదు. మళ్లీ సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయో తెలియని పరిస్థితి. దీంతో ఇక స్వగ్రామానికి వెళ్లిపోవాలనుకున్నారు. తమ రిక్షాల్లోనే 1,090 కిలోమీటర్ల దూరాన్ని 8 రోజుల పాటు ప్రయాణించి ఇళ్లకు చేరుకున్నారు. ఇప్పటికి కూడా శ్రామిక్‌ రైలు సమాచారం తమకు అందలేదని, తాము తమ గ్రామాలకు రాకపోతే ఇప్పటికీ అక్కడే ఉండవలసి వచ్చేదని వారు ఫోన్‌లో  చెప్పారు. బిహార్‌లో ఏ పనిచేయాలో తెలియకపోయినా భార్యాబిడ్డలతో ఉన్నామన్న సంతోషంతో ఉన్నట్లు తెలిపారు.

Updated Date - 2020-05-27T06:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising