ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కులాల పేర్లతో ఉన్న కాలనీలకు కొత్త పేర్లు: మహా ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-12-03T14:03:08+05:30

కులాల పేర్లతో ఉన్న కాలనీలకు కొత్త పేర్లు: మహా ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కులాల పేర్లతో ఉన్న కాలనీలకు కొత్త పేర్లు పెట్టాలని నిర్ణయించినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం పొందగానే ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. మహార్ వాడ, బౌద్ధ్ వాడ, మాంగ్ వాడ, ధోర్ వాస్తి, బ్రాహ్మణ్ వాడ, మాలి గల్లీ లాంటి పేర్లు కులాల పేర్ల వల్ల మహారాష్ట్ర పురోగతి కుంటు పడుతోందని మహా ప్రభుత్వం పేర్కొంది.


వాస్తవానికి ఆ కాలనీల్లో సదరు వర్గాలకు చెందిన గొప్ప వ్యక్తులు నివాసం ఉండడం వల్ల వచ్చిన పేర్లైనప్పటికీ, అక్కడ భిన్న వర్గాల ప్రజలు నివసిస్తుంటారని, అలాంటప్పుడు ఒక వర్గాన్ని సూచించే విధంగా పేర్లు ఉండడం సరికాదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ అభిప్రాయపడ్డట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. అయితే కొత్త కాలనీలకు స్థానికులే కొన్ని పేర్లు సూచిస్తున్నారు. సమతా నగర్, భీమ్ నగర్, జ్యోతి నగర్, షాహున్ నగర్, క్రాంతి నగర్ లాంటి పేర్లను సూచిస్తున్నారు. కొద్ది రోజుల ముందే ‘డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ దళిత్ మిత్ర పురస్కారా’నికి ‘డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ సమాజ్‌భూషన్ పురస్కార్‌‌’గా పేరు మార్చారు.

Updated Date - 2020-12-03T14:03:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising