ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చౌకగా ‘రెమ్‌డెసివిర్‌’

ABN, First Publish Date - 2020-08-14T07:17:32+05:30

తీవ్రమైన కొవిడ్‌-19 లక్షణాల తో బాధపడుతున్న రోగులకు చికిత్స అందించేందుకు వాడే రెమ్‌డెసివిర్‌ జెనరిక్‌ వెర్షన్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసినట్టు జైడస్‌ కాడిలా గురువారం వెల్లడించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఒక్కో వయల్‌ ధర రూ.2,800 


న్యూఢిల్లీ, ఆగస్టు 13: తీవ్రమైన కొవిడ్‌-19 లక్షణాల తో బాధపడుతున్న రోగులకు చికిత్స అందించేందుకు వాడే రెమ్‌డెసివిర్‌ జెనరిక్‌ వెర్షన్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసినట్టు జైడస్‌ కాడిలా గురువారం వెల్లడించింది. రెమ్‌డాక్‌ బ్రాండ్‌ పేరుతో తెచ్చిన ఈ ఇంజెక్షన్‌ 100 ఎంజీ వయల్‌ ధర రూ.2,800గా నిర్ణయించింది. దేశీయంగా అత్యంత తక్కువ ధరకు లభిస్తున్న రెమ్‌డెసివిర్‌ ఔషధం ఇదని కంపెనీ తెలిపింది.


కొవిడ్‌-19 రోగులకు చికిత్స అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తమ డిస్ర్టిబ్యూషన్‌ చెయిన్‌ ద్వారా ఈ ఔషధాన్ని అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. కాగా, స్వల్ప నుంచి మోస్తరు కొవిడ్‌-19 లక్షణాలున్న రోగులకు వినియోగించే ఫావిపిరావిర్‌ ఔష ధ టాబ్లెట్లను ఎంఎ్‌సఎన్‌ గ్రూప్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఫావిలో’ బ్రాండ్‌పేరుతో ఇవి అందుబాటులో ఉంటాయి. 200 ఎంజీ సామర్థ్యం కలిగిన ఒక్కో టాబ్లెట్‌ను రూ.33కే అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత చవకగా ఈ టాబ్లెట్లను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది.

Updated Date - 2020-08-14T07:17:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising