ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊరట... వేదన... కరోనా ప్రభావం

ABN, First Publish Date - 2020-08-25T22:26:58+05:30

దేశంలో కొత్తగా 60 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో... అమెరికా, బ్రెజిల్ తర్వాత మన దేశం మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక... కొత్త కేసుల నమోదులో... ఇండియా అగ్ర స్థానంలో కొనసాగుతోంది. అయితే రికవరీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడమే... కాస్త ఊరటనిచ్చే విషయం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 60 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో... అమెరికా, బ్రెజిల్ తర్వాత మన దేశం మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక... కొత్త కేసుల నమోదులో... ఇండియా అగ్ర స్థానంలో కొనసాగుతోంది. అయితే రికవరీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడమే... కాస్త ఊరటనిచ్చే విషయం.  


అయితే... మొత్తంమీద మాత్రం ఇండియాపై... కరోనా పగబట్టినట్టుగానే కనిపిస్తోంది. కొత్తగా 60,975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31.67 లక్షలు దాటిపోయింది. కొత్తగా 848 మంది చనిపోయారు. కాగా... మొత్తం మరణాల సంఖ్య 58,390 కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.8 శాతంగా ఉండగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,04,348 కు చేరింది.


గత 24 గంటల్లో  దేశంలో 66,550 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారు. అంటే... పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువగానే ఉన్నాయి. ఇది కాస్త ఊరటనిచ్చే విషయమే.  రికవరీ రేటు దేశంలో మరింత పెరిగి 75.9 శాతానికి  చేరింది. గడిచిన 24 గంటల్లో 9.25 లక్షల మందిని పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తం  3.68 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించారు. ఇక...  మొత్తం మరణాల్లో... అమెరికా, బ్రెజిల్, మెక్సికో తర్వాత భారత్  నాలుగో స్థానంలో ఉంది. 

Updated Date - 2020-08-25T22:26:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising