ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెబల్స్‌తో చర్చలకు కాంగ్రెస్ కండిషన్ ఇదేనట!

ABN, First Publish Date - 2020-08-04T19:58:08+05:30

రాజస్థాన్ కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలకు ‘‘బీజేపీ ఇస్తున్న వసతి, భద్రతను’’ వదులుకునే వరకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైసల్మేర్: రాజస్థాన్ కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు ‘‘బీజేపీ ఇస్తున్న వసతి, భద్రతను’’ వదులుకునే వరకు వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అసమ్మతి ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ చర్చలు జరిపే అవకాశాలపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఈ మేరకు స్పందించారు. హర్యానాలోని మునేసర్‌లో అక్కడి పోలీసులు కల్పిస్తున్న భద్రత, వసతితో పాటు బీజేపీతో మైత్రిని వదులుకుంటేనే రెబల్స్‌తో చర్చలు జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. ‘‘గుర్గాన్‌లో సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రజలపై హింసాకాండ కొనసాగుతోంది. అయినా వారికి పోలీసుల సేవలు అందుబాటులో లేవు. కానీ కేవలం 19 మంది అసమ్మతి ఎమ్మెల్యేలకు మాత్రం 1000 మంది పోలీసులను కాపలాగా పెట్టారు. ఆ ఎమ్మెల్యేలు ముందు హర్యానా పోలీసుల భద్రతలను వదులుకోవాలి. బీజేపీ కల్పిస్తున్న సదుపాయాలు, ఆ పార్టీతో చెలిమి వదులుకుని ఇంటికి తిరిగిరావాలి. అప్పుడు మాత్రమే చర్చలు సాధ్యం..’’ అని సుర్జేవాలా పేర్కొన్నారు.  

Updated Date - 2020-08-04T19:58:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising