ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెల్ఫ్ ఐసొలేషన్‌లో కేంద్ర మంత్రి రవిశంకర్

ABN, First Publish Date - 2020-08-03T22:06:25+05:30

కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించిన మరుసటి రోజే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించిన మరుసటి రోజే కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్లిపోయారు. గత శనివారం సాయంత్రం అమిత్‌షాను రవిశంకర్ కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సెల్ఫ్ ఐసొలేషన్‌కు వెళ్లిపోయినట్టు రవిశంకర్ కార్యాలయం సోమవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. మంత్రి ఆరోగ్యంగా ఉన్నారని కూడా తెలిపింది.


హోం మంత్రి అమిత్‌షా ఆదివారంనాడు తనకు కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షలో తేలిందని ప్రకటిస్తూ, తనను కలుసుకున్న వారు కూడా సెల్ఫ్ ఐసొలేషన్‌కు వెళ్లాలని, వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, అమిత్‌షాను తాను కలుసుకున్నందున సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్తున్నట్టు రవిశంకర్ కంటే ముందు పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో ప్రకటించారు.

Updated Date - 2020-08-03T22:06:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising