ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామజన్మభూమి ప్రాంగణంలోకి రామ్‌లల్లా విగ్రహం తరలింపు

ABN, First Publish Date - 2020-03-25T12:15:10+05:30

దేశంలో ఒకవైపు కరోనా వైరస్ ప్రబలుతుండటంతో కేంద్రం సంపూర్ణ లాక్‌డౌన్ విధించినా, అయోధ్య నగరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామ్‌లల్లా విగ్రహాన్ని బుధవారం ఉదయం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామజన్మభూమి ప్రాంగణం (అయోధ్య) : దేశంలో ఒకవైపు కరోనా వైరస్ ప్రబలుతుండటంతో కేంద్రం సంపూర్ణ లాక్‌డౌన్ విధించినా, అయోధ్య నగరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామ్‌లల్లా విగ్రహాన్ని బుధవారం ఉదయం రామజన్మభూమి ప్రాంగణానికి తరలించారు. అయోధ్యలో రామాలయం నిర్మించేవరకూ రామజన్మభూమి ప్రాంగణంలోని మానస భవన్‌లోకి రామ్‌లల్లా విగ్రహాన్ని సీఎం తరలించారు. నవరాత్రి మొదటిరోజు సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ రామాలయం నిర్మాణం కోసం రూ.11లక్షల చెక్ ను ప్రదానం చేశారు.


అయోధ్యలో రామాలయం నిర్మాణానికి  భూమిపూజ చేసే తేదీని ఏప్రిల్ 2వతేదీ రామనవమి సందర్భంగా ప్రకటిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు గతంలో ప్రకటించింది. బుధవారం ఇంజినీరింగ్ నిపుణులతో కూడిన కమిటీ రామాలయం నిర్మాణంపై సాంకేతిక నివేదికను సమర్పించనుంది. రామ్ లల్లా విగ్రహాన్ని భక్తులు దగ్గరి నుంచి చూసి ఆయన ఆశీర్వాదం పొందవచ్చని విశ్వహిందూ పరిషత్ నాయకుడు వినోద్ కుమార్ బన్సాల్ చెప్పారు. 

Updated Date - 2020-03-25T12:15:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising