రామజన్మభూమి తీర్థక్షేత్ర విరాళాలకు ఆదాయపు పన్ను రాయితీ
ABN, First Publish Date - 2020-05-09T13:31:36+05:30
అయోధ్యలో రామాలయం నిర్మించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టుకు ఇచ్చే విరాళాలపై సెక్షన్ 80 జి కింద ఆదాయపు పన్ను రాయితీ ఇస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ....
ఆర్థికమంత్రిత్వశాఖ తాజా ఉత్తర్వులు
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్న విపత్కర సమయంలోనూ కేంద్రం అయోధ్యలో శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్రం నిర్మాణానికి విరాళాలు వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. అయోధ్యలో రామాలయం నిర్మించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టుకు ఇచ్చే విరాళాలపై సెక్షన్ 80 జి కింద ఆదాయపు పన్ను రాయితీ ఇస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధీనంంలోని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. పురాతన ప్రాభవమున్న రామజన్మభూమి అయిన అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ఇచ్చే విరాళాలపై ఆదాయపు పన్ను రాయితీ ఇస్తున్నట్లు సీబీడీటీ విడుదల చేసిన నోటిఫికేషన్ లో ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి దేవాలయం నిర్మాణానికి ఇచ్చిన విరాళాలకు పన్ను చెల్లింపు ఆదాయం నుంచి మినహాయిస్తామని సీబీడీటి పేర్కొంది. అయోధ్యలో ఆలయ నిర్మాణం కోసం మోదీ సర్కారు 15 మంది సభ్యులతో కూడిన ట్రస్టు బోర్డును ఏర్పాటు చేసింది. నిత్య గోపాల్ దాస్ అధ్యక్షుడిగా, చంపత్ రాయ్ ప్రధాన కార్యదర్శిగా, స్వామి గోవింద్ దేవ్ గిరి కోశాధికారిగా ఎన్నికైన ఈ ట్రస్టు గత నెలలో అధికారిక లోగోను విడుదల చేసింది.
Updated Date - 2020-05-09T13:31:36+05:30 IST