ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు సంస్కృత డీమ్డ్ వర్సిటీలకు సెంట్రల్ స్టేటస్

ABN, First Publish Date - 2020-03-17T02:12:41+05:30

సంస్కృత భాషా అభిమానులకు శుభవార్త. కొద్ది సవరణలతో మూడు డీమ్డ్ సంస్కృత యూనివర్శిటీలను సెంట్రల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : సంస్కృత భాషా అభిమానులకు శుభవార్త. కొద్ది సవరణలతో మూడు డీమ్డ్ సంస్కృత యూనివర్శిటీలను సెంట్రల్ యూనివర్శిటీలుగా మార్చాలనే తీర్మానాన్ని రాజ్యసభ సోమవారం ఆమోదించింది. ‘ది సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీస్ బిల్- 2019’ ను మూజువాణీ ఓటుతో రాజ్యసభ ఆమోదించింది. ఇదే తీర్మానాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పోఖ్రియాల్ గత యేడాది డిసెంబర్‌లో లోకసభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ దీనిని ఆమోదించి, మార్చి 2న రాజ్యసభకు పంపింది.


రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ (న్యూఢిల్లీ), శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం (న్యూఢిల్లీ), రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం (తిరుపతి) డీమ్డ్ యూనివర్శిటీలను సెంట్రల్ యూనివర్శిటీలుగా మార్చాలన్న తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మాట్లాడుతూ... దేశంలోని అన్ని భాషలను కేంద్ర ప్రభుత్వం పటిష్టం చేస్తుందని ప్రకటించారు. దేశంలో దాదాపు ఐదు కోట్ల మంది సంస్కృతాన్ని అధ్యయనం చేస్తున్నారని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-03-17T02:12:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising