ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యసభలో రగడ.. సస్పెండ్ అయినా సభలోనే ఎంపీలు..!

ABN, First Publish Date - 2020-09-21T16:58:13+05:30

వివాదాస్పద వ్యవసాయ బిల్లుల నేపథ్యంలో రాజ్యసభలో సస్పెన్షన్ వేటు పడిన ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ బిల్లుల నేపథ్యంలో రాజ్యసభలో సస్పెన్షన్ వేటు పడిన ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి బయటికి వెళ్లేందుకు అంగీకరించలేదు. ఎనిమిది మంది ఎంపీలను వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించినప్పటికీ... వారంతా సభలోనే ఉండి ఆందోళన కొనసాగిస్తున్నారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన చేపట్టడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. మరోవైపు సస్పెన్షన్ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర నిరసనకు దిగడంతో.. రెండు గంటల వ్యవధిలో సభ నాలుగు సార్లు వాయిదా పడింది. సస్పెన్షన్ వేటు పడిన ఎంపీలు బయటికి వెళ్లిపోవాలంటూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పలుమార్లు కోరినప్పటికీ.. సభ్యులు పట్టించుకోలేదు. ఆ ఎంపీలు బయటికి వెళ్తేనే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని ఉపసభాపతి స్పష్టం చేశారు. అయితే అందుకు ప్రతిపక్ష సభ్యులు ససేమిరా అనడంతో సభను మరో అరగంట వాయిదా వేస్తున్నట్టు హరివంశ్ ప్రకటించారు. కాగా సస్పెండ్ అయిన ఎంపీలకు సభలో ఉండే హక్కు లేదనీ... సభ్యులు కాని వారు లోపల ఉండగా సభా కార్యకలాపాలు కొనసాగే అవకాశం ఉండదని బీజేపీ ఎంపీ మురళీధరన్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-21T16:58:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising