ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనీసం ఒక అంగుళం భూమినైనా చైనాకు వదిలేది లేదు : రాజ్‌నాథ్ సింగ్

ABN, First Publish Date - 2020-10-25T19:39:59+05:30

వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి పునరుద్ధరణ జరగాలని భారత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి పునరుద్ధరణ జరగాలని భారత దేశం కోరుకుంటోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. మన దేశ సైన్యం మన దేశ భూభాగంలో కనీసం ఒక అంగుళం భూమినైనా చైనాకు వదిలిపెట్టబోదని స్పష్టం చేశారు. సిలిగురిలో కీలక సైనిక స్థావరమైన 33 కార్ప్స్ హెడ్‌క్వార్టర్స్‌లో  ఆయుధ పూజ నిర్వహించిన తర్వాత ఆయన విలేకర్లతో మాట్లాడారు. 


ఉద్రిక్తతలు సమసిపోవాలని, శాంతి పునరుద్ధరణ జరగాలని భారత దేశం కోరుకుంటోందని చెప్పారు. మన సైన్యం మన భూభాగంలో కనీసం ఒక అంగుళం భూమినైనా  ఇతరుల చేతుల్లోకి వెళ్లనివ్వదనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఆయుధ పూజ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్ జనరల్ ఎంఎం నరవనే, ఆర్మీ సీనియర్ ఆఫీసర్లు పాల్గొన్నారు. 


రాజ్‌నాథ్ సింగ్ షెడ్యూలు ప్రకారం వాస్తవాధీన రేఖ సమీపంలోని సిక్కింలో అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న షెరతాంగ్‌లో ఆయుధ పూజ చేయవలసి ఉంది. కానీ తీవ్రమైన శీతల వాతావరణం కారణంగా ఆయన అక్కడికి వెళ్ళలేకపోయారు. 


మే నెల నుంచి భారత్, చైనా మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇరు దేశాల సైనిక కమాండర్ల స్థాయి, దౌత్య స్థాయి, మంత్రుల స్థాయి సమావేశాలు జరుగుతున్నప్పటికీ ప్రతిష్టంభనకు తెరపడటం లేదు. 


Updated Date - 2020-10-25T19:39:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising