గ్రామాల్లో సోడియం హైపో క్లోరైట్ పిచికారీ చేస్తున్న రాజస్థాన్
ABN, First Publish Date - 2020-03-27T19:30:20+05:30
రోజు రోజుకూ విస్తరిస్తున్న ప్రాణాంతక వైరస్ కోవిడ్-19ను అరికట్టే చర్యల్లో భాగంగా రాజస్థాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం...
న్యూఢిల్లీ: రోజు రోజుకూ విస్తరిస్తున్న ప్రాణాంతక వైరస్ కోవిడ్-19ను అరికట్టే చర్యల్లో భాగంగా రాజస్థాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. దీంతో పాటు లాక్‌డౌన్ నేపథ్యంలో ఎమ్మెల్యే నిధులను రూ.5 లక్షల మేర పొడిగించినట్టు ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ పేర్కొన్నారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైట్‌ను పిచికారీ చేస్తున్నాం. వ్యాధికారక క్రిములను నశింపజేయడానికి, కోవిడ్-19ను అరికట్టడానికి ఇది మంచి పరిష్కారం...’’ అని ఆయన వెల్లడించారు. కాగా ప్రజలకు నిత్యావసరాల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో మరో రెండు కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయనీ... వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 40కి చేరిందని అధికారులు వెల్లడించారు.
Updated Date - 2020-03-27T19:30:20+05:30 IST