ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షోభ వేళ గెహ్లాట్‌కు ఎదురుదెబ్బ

ABN, First Publish Date - 2020-07-14T01:11:09+05:30

జైపూర్: సంక్షోభ వేళ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఒకవేళ విశ్వాస పరీక్ష జరిగితే గెహ్లాట్‌కు అనుకూలంగా ఓటెయ్యరాదని భారతీయ ట్రైబల్స్ పార్టీ తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: సంక్షోభ వేళ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఒకవేళ విశ్వాస పరీక్ష జరిగితే గెహ్లాట్‌కు అనుకూలంగా ఓటెయ్యరాదని భారతీయ ట్రైబల్స్ పార్టీ తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. విశ్వాస పరీక్షకే హాజరుకారాదని స్పష్టం చేసింది. ఈ మేరకు బీటీపీ జాతీయ అధ్యక్షుడు మహేశ్ భాయ్ వసావా లేఖ విడుదల చేశారు. విప్ ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీటీపీకి రాజస్థాన్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు.  


మరోవైపు గెహ్లాట్ నివాసంలో జరిగిన సీఎల్పీ సమావేశానికి 107 మంది ఎమ్మెల్యేలకు గానూ 84 మంది మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది. సమావేశం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ హోటల్‌కు తరలించారు. 200 మంది సభ్యులున్న రాజ్యసభ అసెంబ్లీలో మ్యాజిక్ నెంబర్ 101. తనకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతుందని సచిన్ ప్రకటించిన నేపథ్యంలో గెహ్లాట్ సర్కారు మైనార్టీలో పడినట్లే లెక్క. దీనికి తోడు బీటీపీ తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయడంతో గెహ్లాట్‌కు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దూరమైనట్లైంది. మరోవైపు పైలట్‌ను దారిలోకి తెచ్చేందుకు రాహుల్, ప్రియాంకా వాద్రా, చిదంబరం, అహ్మద్ పటేల్ చివరి యత్నాలు చేస్తున్నారు.   

Updated Date - 2020-07-14T01:11:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising