‘సోషల్ వేదిక’గా రజనీ పార్టీ ప్రకటన!
ABN, First Publish Date - 2020-12-29T09:27:32+05:30
తమిళ రాజకీయాల్లో తనదైన ముద్రవేసేందుకు అడుగులేస్తున్న సూపర్‌స్టార్ రజనీకాంత్.. పార్టీ ప్రకటనను సామాజిక మాధ్యమాల ద్వారా
చెన్నై, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): తమిళ రాజకీయాల్లో తనదైన ముద్రవేసేందుకు అడుగులేస్తున్న సూపర్‌స్టార్ రజనీకాంత్.. పార్టీ ప్రకటనను సామాజిక మాధ్యమాల ద్వారా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఏడు పదుల వయసులో ఉన్న రజనీ.. ఇటీవల హైదరాబాద్‌లో ‘అన్నాత్తే’ షూటింగ్‌లో పాల్గొన్న అనంతరం అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. అనారోగ్యం నుంచి కోలుకున్నప్పటికీ కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన బహిరంగసభలు, మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ముందుగా నిర్ణయించిన మేరకు పార్టీ ప్రకటన చేయాల్సిందేనని రజనీ భావిస్తున్నారు.
Updated Date - 2020-12-29T09:27:32+05:30 IST