ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్‌ గాంధీ మన్‌ కీ బాత్‌!

ABN, First Publish Date - 2020-07-14T07:25:52+05:30

విద్వేషపూరిత కథనాలను టీవీ చానళ్ల ద్వారా ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తన మనసులోని మాటలను స్వయంగా ప్రజలతో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూలై 13: విద్వేషపూరిత కథనాలను టీవీ చానళ్ల ద్వారా ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తన మనసులోని మాటలను స్వయంగా ప్రజలతో పంచుకోవాలని నిర్ణయించుకున్నా రు. అబద్ధాలతో కూడిన కథనాలు దేశాన్ని ముక్కలుగా చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలను ప్రజల ముందుంచాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ‘‘సమకాలీన అంశాలు, చరిత్ర, సంక్షోభాల గురించి మీకు స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నా. వాస్తవం పట్ల ఆసక్తి ఉన్న వారికి ఇవి అందుబాటులో ఉంటాయి. మంగళవారం నుంచి నా ఆలోచనలను వీడియోల ద్వారా పంచుకుంటాను’’ అని సోమవారం ట్విటర్‌లో రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. భారతీయ వార్తా మాధ్యమాలు నియంతృత్వపు ప్రయోజనాలతో బంధీలుగా మారాయన్నారు. విద్వేషంతో కూడిన కథనాలు టీవీ చానళ్లు, వాట్సాప్‌ ఫార్వార్డ్స్‌, తప్పుడు వార్తల ద్వారా వ్యాప్తి అవుతున్నాయన్నారు.

Updated Date - 2020-07-14T07:25:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising