ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీని ప్రశ్నించే హక్కు రాహుల్‌కు లేదు: కేంద్ర మంత్రి

ABN, First Publish Date - 2020-06-23T00:02:55+05:30

లడక్‌లోని గల్వాన్ లోయలో చైనా ఘాతుకంపై మోదీ సర్కార్‌ను కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించడాన్ని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లడక్‌లోని గల్వాన్ లోయలో చైనా ఘాతుకంపై మోదీ సర్కార్‌ను కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించడాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తప్పుపట్టారు. కాంగ్రెస్ హయాంలో గత తప్పిదాలకు ఇప్పటికీ దేశం మూల్యం చెల్లిస్తూనే ఉందని అన్నారు. బీహార్‌లోని బెటియాలో సోమవారంనాడు జరిగిన వర్చువల్ ర్యాలీలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాహుల్‌కు లేదని అన్నారు.


'రాహుల్‌కు మోదీని విమర్శించే హక్కు ఎక్కడిది? ఆయన పార్టీ (కాంగ్రెస్) ప్రభుత్వాలు గతంలో ఏం చేశాయో గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను మోదీ ప్రభుత్వం సరిచేస్తూ వస్తోంది' అని నిత్యానంద్ రాయ్ అన్నారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సత్తా మోదీ సర్కార్‌కు ఉందని, శత్రువుకు గట్టి సమాధానం ఇవ్వడానికి సిద్ధమేనని చెప్పారు. జాతీయ ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఇప్పటికే ప్రధాని చాలా స్పష్టంగా చెప్పారని రాయ్ వివరించారు.


'ఇప్పటికిప్పుడు యావద్దేశం, 130 కోట్ల మంది ప్రజలు స్థిరచిత్తంతో ప్రధానికి బాసటగా ఉన్నారు. రాహుల్ మాట్లాడుతున్న తీరు మాత్రం చైనా, పాకిస్థాన్‌ భాషలో ఉంది' అని కేంద్ర మంత్రి తప్పుపట్టారు. బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్టీయే కూటమికి ప్రజలు ఓటు వేసి గట్టి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

Updated Date - 2020-06-23T00:02:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising