ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహులే బాగు.. కాదంటే మాత్రం మన్మోహనే : ఇండియాటుడే సర్వే

ABN, First Publish Date - 2020-08-08T21:30:02+05:30

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ అత్యంత అనువైన వ్యక్తి అని ఓ సర్వేలో వెల్లడైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ అత్యంత అనువైన వ్యక్తి అని ఓ సర్వేలో వెల్లడైంది. ఇదే విషయంపై ‘ఇండియాటుడే - కార్వీ ఇన్‌సైట్స్ సంస్థలు ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ అన్న పేరుతో ఓ సర్వే నిర్వహించారు. ఇందులో 12,021 పాల్గొనగా.... 23 శాతం మంది ప్రజలు ఎంపీ రాహుల్‌ గాంధీ వైపు మొగ్గారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ అయితే బాగుంటుందని తేల్చారు.


ఇక రెండో స్థానంలో అనూహ్యంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వైపు మొగ్గారు ప్రజలు. ఏ పరిస్థితుల్లో అయినా రాహుల్ కాకపోతే.... మాజీ ప్రధాని మన్మోహన్ అయితే బాగుంటుందని 18 శాతం మంది అభిప్రాయపడ్డారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలను కాదని సర్వేలో మన్మోహన్ వైపు మొగ్గారు.


ఇక... 14 శాతం మంది ప్రియాంక, సోనియా అధ్యక్షులైతే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్ష బాధ్యతల్లో ఉంటే బాగుంటుందని ఎంపీలందరూ కొన్ని రోజుల కిందటే సోనియాతో అన్నట్లు సమాచారం. 

Updated Date - 2020-08-08T21:30:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising